News April 6, 2025
PBKS VS RR.. గెలుపెవరిదంటే?

PBKSతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 206 రన్స్ టార్గెట్‌తో బరిలో దిగిన పంజాబ్ 155/9 స్కోరుకే పరిమితమైంది. నెహాల్ వధేరా(62), మ్యాక్స్‌వెల్(30) మినహా జట్టులో అందరూ విఫలమయ్యారు. RR బౌలర్లలో ఆర్చర్ 3, సందీప్ శర్మ, తీక్షణ చెరో 2 వికెట్లు, కుమార్ కార్తికేయ, హసరంగ చెరో వికెట్ తీశారు. ఈ సీజన్లో PBKSకు ఇదే తొలి ఓటమి.
Similar News
News April 6, 2025
రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోనీ

IPLకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై CSK స్టార్ ప్లేయర్ MS ధోనీ స్పందించారు. ‘ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. ఇంకా ఆడుతున్నాను. ఈ జులై నాటికి నాకు 44 ఏళ్లు వస్తాయి. తదుపరి సీజన్ ఆడాలా, వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు మరో 10 నెలల సమయం ఉంది. ఆడగలనా, లేదా? అనేది నిర్ణయం శరీరం అందించే సహకారం బట్టి తీసుకుంటా’ అని రాజ్ షమానీతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో MSD వెల్లడించారు.
News April 6, 2025
అమిత్ షా చెప్పులు మోసిన చరిత్ర సంజయ్‌ది: మహేశ్ కుమార్

TG: కాంగ్రెస్, సీఎం రేవంత్‌పై <<16012655>>విమర్శలు చేసిన<<>> బండి సంజయ్‌పై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైరయ్యారు. రాష్ట్ర BJP అధ్యక్షుడిగా ఉండి అమిత్ షా చెప్పులు మోసిన చరిత్రను మర్చిపోయావా? అని నిలదీశారు. బీజేపీలో ఉనికి కోసం బండి ఆరాటపడుతున్నారని, మోదీ, షా అనుమతి లేనిదే ఆయన టిఫిన్ కూడా చెయ్యరని ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక బీఆర్ఎస్తో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు.
News April 6, 2025
మోదీ కౌంటర్..సంతకాలైనా తమిళంలో చేయండి

వైద్య విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రం నుంచి వచ్చిన వినతి పత్రాలలో సంతకాలు తమిళంలో ఉండవని, కనీసం సంతకాలైనా మాతృభాషలో చేస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకులకు సూచించారు. తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేస్తే తమిళ భాషకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.