News March 29, 2024
BREAKING: RCB ఘోర ఓటమి

RCB ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఈ IPLలో ఇప్పటివరకు హోమ్ గ్రౌండ్లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. ఇవాళ చిన్నస్వామి స్టేడియంలో KKR చేతిలో RCB చతికిలపడింది. 183 పరుగుల టార్గెట్ను KKR 3 వికెట్లు కోల్పోయి 19 బంతులు ఉండగానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ల ముందు RCB బౌలర్లు తేలిపోయారు. వెంకటేశ్ 50, నరైన్ 47, సాల్ట్ 30, శ్రేయస్ 39* పరుగులు చేశారు. అంతకుముందు కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో RCB 182 రన్స్ చేసింది.
Similar News
News December 6, 2025
భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>
News December 6, 2025
టైప్ 5 డయాబెటిస్ సింప్టమ్స్ ఏంటో తెలుసా?

* న్యూట్రిషన్ డెఫిషియన్సీతో చర్మం, జుట్టు రంగుమారడం.
* లాలాజల గ్రంథుల్లో మార్పులు.
* రోగనిరోధక శక్తి తగ్గడంతో తరచూ చర్మం, చిగుళ్లు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడడం.
* BMI (18.5) కంటే తక్కువ ఉండడం.
* దీర్ఘకాల పోషకాహార లోపం వల్ల ఎదుగుదల ఆగిపోవడం వంటివి టైప్-5 డయాబెటిస్ లక్షణాలు.
* అధిక దాహం, ఒకేసారి బరువు తగ్గడం, నీరసం, కంటిచూపు తగ్గడం డయాబెటిస్ ముఖ్య లక్షణాలు.


