News October 3, 2024

BREAKING: ఓటర్ల తుది జాబితా విడుదల

image

TG: పంచాయతీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12,867 పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతర ఓటర్లున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లున్నారు.

Similar News

News September 15, 2025

ఏపీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు

image

APPSC 10 తానేదార్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అక్టోబర్ 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 330. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/

News September 15, 2025

‘మిరాయ్’లో రాముడి రోల్ చేసింది ఎవరంటే?

image

‘మిరాయ్’లో రాముడి పాత్ర AIతో రూపొందించలేదని సినీ వర్గాలు తెలిపాయి. ఈ క్యారెక్టర్‌లో బాలీవుడ్ నటుడు గౌరవ్ బోరా కనిపించారని పేర్కొన్నాయి. హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ చేసిన డెహ్రడూన్‌కు చెందిన ఈ యాక్టర్ పలు కమర్షియల్ యాడ్స్‌లోనూ కనిపించారు. అయితే మూవీలో ఫేస్‌ను రివీల్ చేయకుండా డైరెక్టర్ కార్తీక్ జాగ్రత్తపడ్డారు. అంతకుముందు ఈ రోల్ <<17686798>>ప్రభాస్<<>> కనిపించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News September 15, 2025

నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

image

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.