News March 20, 2025

BREAKING: హైకోర్టులో హరీశ్ రావుకు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చక్రధర్ అనే వ్యక్తి హరీశ్‌తో పాటు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News November 19, 2025

మెదక్: బ్యాట్ పట్టిన ఎంపీ రఘునందన్ రావు

image

ఎంపీ రఘునందన్ రావు క్రికెట్ బ్యాట్ పట్టారు. మెదక్‌లో క్రీడాకారులతో సరదాగా కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో మెదక్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి 17 సంవత్సరాలలోపు బాలుర క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించారు.
ముగింపు కార్యక్రమంలో ఎంపీ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

News November 19, 2025

స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే అసహనం ఎందుకు: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంటుపై ప్రశ్నిస్తే చంద్రబాబు <<18299181>>సహనం<<>> కోల్పోతున్నారని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బాధ్యత గల CM స్పందించాల్సిన విధానమిదేనా అని నిలదీశారు. డొంకతిరుగుడు సమాధానాలు మాని ప్రైవేటుపరం కానివ్వమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. CM వైఖరిపై అనుమానాలున్నాయన్నారు. అటు ప్రభుత్వ పెద్దలు, పోలీసు వ్యవస్థ తెచ్చిన ఒత్తిడితోనే పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ చనిపోయి ఉంటాడని ఆరోపించారు.

News November 19, 2025

పిల్లలు లేని వృద్ధ దంపతులకు ఏ ఇల్లు అనుకూలం?

image

వృద్ధాప్యంలో భద్రత, చుట్టూ ఇతరులు ఉండే వాతావరణం ముఖ్యం. అలాంటివారికి చిన్న అపార్ట్‌మెంట్‌లు సౌకర్యంగా ఉంటాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వారి అవసరాలు తీరేలా, వాస్తు ఆధారంగా నిర్మించిన చిన్న ఇల్లు/ప్లాట్ కొనడం ఉత్తమం అంటున్నారు. పైగా చిన్న ఇంటిని నిర్వహించడానికి వారికి సులభంగా ఉంటుంది. సామాజిక వాతావరణం ఒంటరితనాన్ని తగ్గిస్తుంది. పెద్ద వయసులో భద్రత ప్రధానం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>