News March 19, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

SBIలో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2వేల PO పోస్టులకు 2023 SEPలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని షార్ట్ లిస్ట్ చేసి జనవరిలో సైకోమెట్రిక్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా ఎంపికైన వారి రోల్ నెంబర్లతో తుది ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం <>క్లిక్<<>> చేయండి.

Similar News

News February 7, 2026

ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

image

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.

News February 7, 2026

TISSలో ఉద్యోగాలు

image

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌(<>TISS<<>>) 11 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ(MCom)అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, PwBDలకు రూ.125. నెలకు రూ.25వేలు చెల్లిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tiss.ac.in

News February 7, 2026

‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’’

image

దేవుడున్నాడా లేదా అనే తర్కం కంటే, ఆయన ఉన్నాడు అనే ఊహ ఇచ్చే ఊరట చాలా గొప్పది. కష్టకాలంలో కొండంత అండగా, ఒంటరితనంలో ఆత్మబంధువుగా ఆయనను తలచుకోవడం కంటే ప్రశాంతమైన అనుభూతి మరొకటి ఉండదు. కళ్లు మూసి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని స్మరిస్తే కలిగే పారవశ్యం ముందు ఏ సుఖమూ సాటిరాదు. ఆ నమ్మకమే ఓ ధైర్యం. ఆ భావమే ఓ బలం. ఆ దివ్య అనుభూతిలో తేలియాడటం మనసుకు దొరికే అత్యున్నత ఆధ్యాత్మిక ప్రశాంతత.