News February 18, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CHSL-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2024 APRలో ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా జులైలో టైర్-1, NOVలో టైర్-2 ఎగ్జామ్స్ నిర్వహించారు. మొత్తం 3,954 పోస్టులు ఉన్నాయి. తాజాగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సైట్‌లో పొందుపర్చింది. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక ప్రక్రియ పూర్తవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 25, 2025

ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

image

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్‌ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.

News November 25, 2025

హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

image

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.

News November 25, 2025

UIDAIలో టెక్నికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

image

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(<>UIDAI<<>>) 8 టెక్నికల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. షార్ట్ లిస్ట్, స్క్రీన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://uidai.gov.in/