News April 1, 2025

BREAKING: ఫలితాలు విడుదల

image

IBPS నిర్వహించిన 11,826 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్(CSA)-క్లర్క్ పోస్టుల మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు <>ibpsonline.ibps.in<<>> వెబ్‌సైట్‌లో తమ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. స్కోర్ కార్డ్స్, మార్కులు, కటాఫ్ వివరాలను సైతం బోర్డు విడుదల చేసింది. ఏప్రిల్ 30 వరకు రిజల్ట్స్ అందుబాటులో ఉండనున్నాయి. గతేడాది అక్టోబర్ 13న క్లర్క్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి.

Similar News

News April 2, 2025

ఇంటర్ అర్హతతో నేవీలో ఉద్యోగాలు

image

ఇండియన్ నేవీ ‘అగ్నివీర్ సీనియర్ సెకండరీ రిక్రూట్’ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు పాసై 2004 సెప్టెంబర్ 1-2008 డిసెంబర్ 31 మధ్య జన్మించి ఉండాలి. ఎంపికైన ప్రతి నలుగురిలో ఒకరికే పర్మినెంట్ జాబ్. జీతం తొలి నాలుగేళ్లు రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో ఉంటుంది. ఈ నెల 10లోగా https://www.joinindiannavy.gov.in/లో అప్లై చేసుకోవాలి.

News April 2, 2025

ప్రపంచానికే సాయం.. భారత్ విపత్తు దౌత్యం

image

ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే విపత్తు సంభవించిందంటే మొట్ట మొదటిగా భారతే స్పందిస్తుంది. 1959లో టిబెట్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడం నుంచి నిన్న మొన్నటి మయన్మార్‌ భూకంపంలో ‘ఆపరేషన్ బ్రహ్మ’ వరకు భారత్ చేసిన సాయం అంతాఇంతా కాదు. దీన్ని ‘విపత్తు దౌత్యం’గా విదేశీ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు. సాధారణ దౌత్యంతో కుదరని బలమైన సంబంధాల్ని ఈ దారిలో భారత్ సాధిస్తోందని కొనియాడుతున్నారు.

News April 2, 2025

కరోనా బారినపడ్డ పాక్ అధ్యక్షుడు

image

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయనను కరాచీలోని ఓ ఆసుపత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. జర్దారీ జ్వరంతో పాటు శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కరోనా నిర్ధారణకు ముందు ఆయన ఈద్ ప్రార్థనల్లో పాల్గొనడంతో పాటు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!