News April 5, 2025
SBI PO ఫలితాలు విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI PO ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. గత నెల 8, 16, 24, 26 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, DOB, క్యాప్చా ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News September 13, 2025
టాలీవుడ్ సంచలనం.. తేజా సజ్జ

కలిసుందాం రా, ఇంద్ర, ఠాగూర్, గంగోత్రి తదితర సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన తేజా సజ్జ వరుస హిట్లతో అదరగొడుతున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, తాజాగా ‘మిరాయ్’ మూవీతో సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా దైవభక్తికి సంబంధించిన హనుమాన్, మిరాయ్ అతడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తేజకు మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.
News September 13, 2025
TODAY HEADLINES

*మంగళగిరిలో Way2News Conclave.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
*మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: CM చంద్రబాబు
*గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తాం: సజ్జల
*ఉపరాష్ట్రపతిగా CP రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
*ఈనెల 15 నుంచి TGలో కాలేజీలు బంద్: FATHI
*AP లిక్కర్ కేసులో 10మంది నిందితులకు రిమాండ్ పొడిగింపు
*నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
*USలో భారతీయుడిని తల నరికి దారుణ హత్య
News September 13, 2025
ఆసియా కప్: ఒమన్‌పై పాకిస్థాన్ విజయం

ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఒమన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఆ జట్టు 67 రన్స్‌కే ఆలౌట్ అయింది. హమద్ మీర్జా(27) టాప్ స్కోరర్‌గా నిలిచారు. పాక్ బౌలర్లలో అష్రఫ్, సుఫియాన్ ముకీమ్, సయీమ్ అయుబ్ తలో 2 వికెట్లతో రాణించారు.