News September 27, 2024
BREAKING: ఫలితాలు విడుదల

ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్/రోల్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. అక్టోబర్ 10వ తేదీ వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. 9,923 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. ఆగస్టు 10, 17, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం <
Similar News
News November 22, 2025
యాపిల్ ఎయిర్‌డ్రాప్ ఫీచర్ క్రాక్ చేసిన గూగుల్

ఐఫోన్లలో ఉండే క్విక్ షేర్ ఫీచర్ ఎయిర్‌డ్రాప్‌ను గూగుల్ క్రాక్ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్లకు డేటా, ఫొటోలు, వీడియోలు ట్రాన్స్ఫర్ చేయవచ్చని వెల్లడించింది. యాపిల్ సహకారం లేకుండానే దీనిని సాధించామని గూగుల్ ప్రతినిధి అలెక్స్ మొరికోనీ తెలిపారు. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అన్ని మోడల్స్‌లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీని వల్ల యూజర్ల సేఫ్టీకి ఏ ఇబ్బంది ఉండదన్నారు.
News November 22, 2025
IIT హైదరాబాద్‌లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.


