News April 11, 2025
BREAKING: రేపు ఇంటర్ రిజల్ట్స్

ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఫలితాలను అందరికంటే ముందుగా వే2న్యూస్‌లో పొందవచ్చు.
– వే2న్యూస్ యాప్‌లో వచ్చే స్పెషల్ స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కితే చాలు. సెకన్లలో ఫలితాలు వస్తాయి. డౌన్లోడ్ అని మరొక్క క్లిక్ చేస్తే రిజల్ట్ కార్డ్ సన్నిహితులకు షేర్ చేసుకోవచ్చు.
Similar News
News January 17, 2026
పూజ గది ఎక్కడ ఉంటే ఉత్తమం?

ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండాలనే నియమం అందరికీ వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇల్లు పెద్దదైతే ఈశాన్యం అనుకూలం, కానీ చిన్న ఇళ్లలో తూర్పు, పడమర దిశలలో, మధ్య భాగానికి ఉత్తరం వైపుగా జరిపి ఏర్పాటు చేసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. ‘పడకగది లేదా వంటగదిలో పూజ అస్సలు చేయకూడదు. పూజ గదికి పవిత్రతతో పాటు కాస్త గోప్యత కూడా అవసరమని గ్రహించాలి’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 17, 2026
షర్ట్ లెస్ ఫొటో షేర్ చేసిన రామ్‌చరణ్

జిమ్‌లో వర్కౌట్ చేస్తూ షర్ట్ లెస్ ఫొటోను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ SMలో షేర్ చేశారు. ‘ఉత్సాహంగా ఉన్నాను. సైలెంట్‌గా పనిచేస్తున్నాను. తదుపరి ఛాలెంజ్‌కు రెడీ’ అని క్యాప్షన్ పెట్టారు. RRR వంటి సినిమా తర్వాత చరణ్ చేస్తున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని, అన్న బాడీ బాక్సాఫీస్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది.
News January 17, 2026
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు

రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్, స్పోర్ట్స్ వెల్ఫేర్ ఐజీగా గజరావ్ భూపాల్, ఫ్యూచర్ సిటీ ఏసీపీ(అడ్మిన్-ట్రాఫిక్)గా చందనా దీప్తి, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వ రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతీ, సైబరాబాద్ డీసీపీ(అడ్మిన్)గా టి.అన్నపూర్ణ, సీఐడీ ఎస్పీగా వెంకటేశ్వర్లను నియమించింది.


