News April 25, 2024
BREAKING: పెరిగిన బంగారం ధరలు

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 పెరిగి రూ.72,650కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.450 పెరిగి రూ.66,600గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.82,900గా నమోదైంది.
Similar News
News March 25, 2026
ఇరాన్ మైండ్ గేమ్: చమురు అస్త్రం సక్సెస్?

అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధంతో కలిగించే నష్టాల కంటే సుదీర్ఘ ఘర్షణతో గ్లోబల్ ఆయిల్ సంక్షోభం సృష్టించాలనే ఇరాన్ మైండ్ గేమ్ ఫలించిందని నిపుణులు అంటున్నారు. ఇంధన కొరత భయంతో ట్రంప్ వెనక్కి తగ్గడం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును అంగీకరించడం ఆ దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. నాయకత్వ మార్పు కోరుకున్న US చివరకు అదే నాయకత్వంతో రాజీకి రావడం ఇరాన్ సక్సెస్‌ను చాటిచెబుతోంది.
News March 25, 2026
రింకూకు KKR ప్రమోషన్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రహానే కెప్టెన్‌గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్‌ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్‌గానే కాకుండా టీమ్ లీడర్‌గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.
News March 25, 2026
ఆ ఫుడ్స్ తింటే తండ్రయ్యే ఛాన్స్ తక్కువట!

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ వర్సిటీ స్టడీలో తేలింది. చిప్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. అటు మహిళల్లో ఈ ఫుడ్ వల్ల గర్భంలో పిండం ఎదుగుదల నెమ్మదిస్తుందని ఈ సర్వే హెచ్చరించింది.


