News October 22, 2024

BREAKING: రౌడీ షీటర్ దాడి.. సహానా కన్నుమూత

image

AP: గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్ నవీన్ దాడిలో బ్రెయిన్ డెడ్ అయిన యువతి సహానా మరణించింది. 3 రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచింది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా నిందితుడు టీడీపీ కార్యకర్త. అతను సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో దిగిన ఫొటోలను వైసీపీ షేర్ చేస్తోంది.

Similar News

News January 16, 2026

ED దాడులు.. బీరువా నిండా రూ.500 నోట్లు

image

ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈడీ చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు దొరికింది. బొగ్గు, బ్లాక్ స్టోన్ అక్రమ మైనింగ్‌పై విచారణ నేపథ్యంలో 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. PMLA కింద మాఫియా, వారి వ్యాపార భాగస్వాముల ఇళ్లలో దాడులు చేసింది. ఓ బీరువా నిండా నగదు, లగ్జరీ కార్లు, ఆస్తి పత్రాలను గుర్తించింది. ఆ నగదు విలువ ఎంతో త్వరలో వెల్లడిస్తామని ఈడీ తెలిపింది.

News January 16, 2026

14 వేల పోలీసు ఉద్యోగాలు.. BIG UPDATE

image

TG: రాష్ట్రంలో 2024 నుంచి ఈ ఏడాది జనవరి వరకు 17 వేల మంది కానిస్టేబుల్, ఇతర సిబ్బంది రిటైర్ అయ్యారని అధికారులు నివేదిక ఇచ్చారు. వీరిలో దాదాపు 1100 మంది ఎస్సై, సీఐ, ఇతర సిబ్బంది ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ పరిధిలోనే 6 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీ మేరకు 14 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం, ఆర్థికశాఖకు హోంశాఖ ఫైల్ పంపింది. ఆమోదం రాగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశముంది.

News January 16, 2026

242 బెట్టింగ్ సైట్లు బ్లాక్

image

ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లకు కేంద్రం షాక్ ఇచ్చింది. చట్టవిరుద్ధమైన 242 సైట్ల లింక్‌లను బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 7,800 ఇల్లీగల్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సైట్లను నిషేధించింది. వీటి వల్ల సమాజానికి నష్టం జరుగుతోందని, యువత భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం తెలిపింది.