News February 16, 2025
BREAKING: బాధితులకు రూ.10 లక్షల పరిహారం

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట బాధితులకు భారత రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది.
Similar News
News January 21, 2026
NASA నుంచి సునీతా విలియమ్స్ రిటైర్!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(60) నాసా నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. తన కెరీర్లో 3 మిషన్లలో 608 రోజులు ఆమె స్పేస్లో గడిపారు. 62 గంటల 6 నిమిషాలు 9 స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్షంలో మారథాన్ పూర్తి చేసిన తొలి వ్యక్తి సునీత. 1998లో నాసాకు సెలక్టయిన ఆమె 27 ఏళ్లపాటు అందులో పని చేశారు. ఇటీవల 10 రోజుల మిషన్ కోసం వెళ్లి తొమ్మిదిన్నర నెలలపాటు <<15965407>>స్పేస్లో గడపడం<<>> తెలిసిందే.
News January 21, 2026
సీఎంల దావోస్ పర్యటన.. డబ్బు వృథానే: రాజీవ్ శుక్లా

సీఎంల దావోస్(Swiz) పర్యటనపై రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా అసహనం వ్యక్తం చేశారు. ‘భారతీయులు వెళ్లి భారతీయులనే కలుస్తున్నారు. దేశీయ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. భారత్లోనే ఈ అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు స్విట్జర్లాండ్ వెళ్లి అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి. ఇదంతా డబ్బు వృథానే. అక్కడికి వెళ్లినప్పుడు విదేశీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటే కాస్త ప్రయోజనకరం’ అని Xలో రాసుకొచ్చారు. దీనిపై మీ COMMENT?
News January 21, 2026
9 మంది కూతుళ్ల తర్వాత కొడుకు.. మళ్లీ అక్కడే!

ఆడ పిల్లలున్నా మగ సంతానం కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు కొందరు దంపతులు. హరియాణాలోని జింద్(D)లో 10వ ప్రసవంలో కొడుక్కి జన్మనిచ్చిందో మహిళ. ఉచానా కలాన్లో సురేంద్ర, రీతుకు ఇప్పటికే 9 మంది కూతుళ్లు ఉండటం గమనార్హం. అమ్మాయిలకు కాఫీ(ఇక చాలు), మాఫీ(క్షమాపణ) పేర్లు పెట్టామని, ఇక తమకు పిల్లలు చాలని రీతు చెప్పారు. ఇటీవల ఉచానాలోనే 10 మంది <<18796058>>ఆడపిల్లలున్న మహిళ<<>> 11వ సారి గర్భం దాల్చి కొడుకుకు జన్మనివ్వడం తెలిసిందే.


