News October 22, 2024
BREAKING: కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

TG: తన క్యారెక్టర్‌పై చేస్తున్న నిరాధార ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చినట్లు మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొండా సురేఖ అభ్యంతరకర <<14254371>>వ్యాఖ్యలపై<<>> రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. గత కొంత కాలంగా తన క్యారెక్టర్‌ను దిగజార్చేందుకు సోషల్ మీడియాలో చేసే ప్రయత్నాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. కోర్టులో నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.
Similar News
News March 16, 2025
ట్విటర్లో గ్రోక్ హల్‌చల్.. మీమ్స్ వైరల్

ట్విటర్ తీసుకొచ్చిన గ్రోక్ AI గురించి నెట్టింట మీమ్స్ పేలుతున్నాయి. నిజమైన మనిషి తెలుగును ఇంగ్లిష్‌లో టైప్ చేస్తే ఎలా ఉంటుందో అదే తరహాలో భాషలో ఎటువంటి తప్పులూ లేకుండా గ్రోక్ జవాబులిస్తోంది. ఆఖరికి బూతులు కూడా నేర్చుకుని, తిట్టిన వారిని తిరిగి తిడుతుండటంతో ట్విటర్ జనాలు జోకులు పేలుస్తున్నారు. ఫ్యాన్ వార్స్‌లోనూ గ్రోక్‌ను ఇన్వాల్వ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మిగతా భాషల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోంది.
News March 16, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం బ్రేక్

AP: కృష్ణా జలాలను రాయలసీమకు తరలించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, తాత్కాలిక నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని (35వేల క్యూసెక్కులు) తరలించేలా ఈ ఎత్తిపోతల పథకం చేపట్టారు. అనుమతులు నిరాకరించడంపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.
News March 16, 2025
GOOD NEWS: వారికి ఉచితంగా బస్సు

AP: రేపటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లిష్ మీడియం, NCERT సిలబస్‌తో వచ్చే నెల 1వరకూ పరీక్షల్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలనుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. హాల్ టికెట్ ఆధారంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది పరీక్షలకు 6,49,275 మంది హాజరుకానున్నారు.