News June 5, 2024
BREAKING: సజ్జల రాజీనామా

AP: ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆయన.. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు.
Similar News
News December 1, 2025
నాగిరెడ్డిపేట: బీమా డబ్బు కోసం వేధింపులు.. మహిళ ఆత్మహత్య

నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన లక్ష్మీ అత్తారింటికి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. లక్ష్మీ భర్త గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చెప్పారు. ఆయన పేరుపై వచ్చిన బీమా డబ్బుల కోసం అత్తారింటి వారు లక్ష్మిని వేధించినట్లు పేర్కొన్నారు. దీంతో వారి వేధింపులు భరించలేక ఇంట్లో ఉరేసుకున్న మృతి చెందినట్లు ఆయన వివరించారు.
News December 1, 2025
పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్ను!

పొగాకు, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాపై ప్రత్యేక పన్నులు విధించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు-2025, నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లు-2025ను ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాక పొగాకు, పొగాకు ప్రొడక్టులపై జీఎస్టీతోపాటు ఎక్సైజ్ లెవీని విధిస్తారని తెలుస్తోంది. పాన్ మసాలా తయారీపై జీఎస్టీతోపాటు కొత్త సెస్ విధించనున్నట్లు సమాచారం.
News December 1, 2025
ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.


