News January 11, 2025
BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.
Similar News
News January 17, 2026
నితీశ్ రెడ్డి ఆల్‌రౌండర్ కాదు: కైఫ్

NZతో ODI సిరీస్‌లో IND పిచ్‌కి తగ్గట్టు ప్లేయింగ్-11ని ఎంపిక చేయట్లేదని మాజీ క్రికెటర్ కైఫ్ అన్నారు. జట్టులో నితీశ్ రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన YouTube వీడియోలో చెప్పుకొచ్చారు. ‘నితీశ్ ఆల్‌రౌండర్ కాదు. అతను బ్యాటర్ మాత్రమే. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలి. అతడిని బ్యాటర్‌గా డెవలప్ చేయాలి. పార్ట్ టైమ్ బౌలర్‌ను ఆల్‌రౌండర్ అనడం కరెక్ట్ కాదు’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
News January 17, 2026
రానున్న 5 రోజులు వర్షాలు

TG: రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని పేర్కొంది. అటు రాష్ట్రంలో నిన్నటి వరకు చలి తీవ్రత తగ్గినట్లు కనిపించగా ఇవాళ పెరిగింది. మరోవైపు ఫిబ్రవరి తొలి వారం నుంచి ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News January 17, 2026
కొరియన్ బ్యూటీ సీక్రెట్ ఇదే..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కొరియన్ బ్యూటీ ట్రెండ్ వైరల్ అవుతోంది. కొరియన్లలా కనిపించాలని వారు వాడే ఉత్పత్తులు వాడితే సరిపోదంటున్నారు నిపుణులు. వారి బ్యూటీ సీక్రెట్ ఆరోగ్యకరమైన అలవాట్లే కారణం. మార్నింగ్ స్కిన్‌కేర్ రిచ్యువల్, ప్రోబయోటిక్స్ ఆహారాలు, తగిన నిద్ర, నీరు తీసుకోవడం, సన్ స్క్రీన్ ఎక్కువగా వాడటం, ప్రకృతిలో సమయం గడపడం కొరియన్ల అలవాటు. వీటివల్లే వారు అందంగా, ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.


