News April 14, 2025

BREAKING: ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

image

TG: ఎస్సీ వర్గీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. A గ్రూపునకు 1 శాతం, B గ్రూపునకు 9 శాతం, C గ్రూపునకు 5 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించింది.

Similar News

News March 11, 2026

గ్యాస్ బుక్ చేస్తున్నారా?

image

TG: గ్యాస్‌ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. అందుకు నకిలీ LPG బుకింగ్ సైట్లను క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. త్వరగా సిలిండర్ సప్లై చేస్తామంటే నమ్మొద్దని, అది మోసమని గ్రహించాలని చెప్పారు. సిలిండర్ బుకింగ్ పేరిట అపరిచిత వ్యక్తులకు OTPలు చెప్పొద్దని సూచించారు. ఈ తరహా మోసాలకు గురైతే 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు.

News March 11, 2026

గూగుల్, అమెజాన్‌లపై ఇరాన్ గురి

image

US ఎంబసీలు, సైనిక స్థావరాలపైన దాడి చేస్తున్న ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన ఫోకస్ పెట్టింది. USకు చెందిన క్లౌడ్, డేటా అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఇరాన్ కొత్త టార్గెట్ల జాబితాలో చేరాయని ఆ దేశ మీడియా తస్నిమ్ న్యూస్ తెలిపింది. దీంతో గల్ఫ్ సహా ఇజ్రాయెల్‌లోని అమెరికన్ టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఐబీఎమ్, ఒరాకిల్, పాలంటీర్ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

News March 11, 2026

గ్యాస్ కొరత.. హోటళ్లకు 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం

image

TG: రాష్ట్రంలో హోటళ్లపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని 50 వేల హోటళ్లుండగా రోజూ ₹300 కోట్ల టర్నోవర్ జరుగుతుండగా, 2 రోజుల్లో ₹20 కోట్ల నష్టం జరిగింది. ఇక స్టాక్ సిలిండర్లు 2-3 రోజులకే ఉండటంతో ఈ నష్టం భారీగా పెరగనుందని హోటల్ యాజమాన్యాల ప్రతినిధి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే వాణిజ్య గ్యాస్ సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో మంత్రి ఉత్తమ్ చర్చిస్తున్నట్లు అధికారులు తెలిపారు.