News December 21, 2024
విశాఖ జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు

AP: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్రను గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Similar News
News October 27, 2025
ఇంటి చిట్కాలు

* గాజు సామగ్రిపై ఉప్పు చల్లి, తర్వాత శుభ్రపరిస్తే అవి తళతళా మెరుస్తాయి.
* వెండి సామగ్రి భద్రపరిచేటపుడు వాటితో సుద్దముక్కని కూడా పెట్టాలి. ఇవి తేమను పీల్చుకుని వెండి నల్లబడకుండా చేస్తాయి.
* సన్నని మూతి ఉన్న ఫ్లవర్ వాజు క్లీన్ చేయాలంటే బియ్యం, గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా గిలకొట్టి శుభ్రం చేయాలి.
* బల్లుల బెడద ఎక్కువగా ఉంటే, నెమలీకలు గోడలకి తగిలిస్తే సమస్య తగ్గుతుంది.
News October 27, 2025
నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్లో 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.
News October 27, 2025
AI సాయంతో మ్యాథ్స్లో రఫ్ఫాడిస్తున్నారు!

రాజస్థాన్లోని టోంక్ జిల్లా విద్యార్థులు AI సాయంతో చదువులో అదరగొడుతున్నారు. ‘PadhaiWithAI’ ప్లాట్ఫామ్లో అభ్యసించేలా కలెక్టర్ సౌమ్య ఝా విద్యార్థులను ప్రోత్సహించారు. దీంతో కేవలం 6 వారాల్లో 10వ తరగతి గణితం పాస్ పర్సంటేజ్ 12% నుండి 96.4%కి పెరిగింది. ఇది సంప్రదాయ విద్యలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. కలెక్టరే స్వయంగా విద్యార్థులపై శ్రద్ధపెట్టి పర్యవేక్షించడంతో ఇది సాధ్యమైంది.


