News September 11, 2024
BREAKING: రాష్ట్రంలో సెబ్ రద్దు

ఏపీలో SEB(స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో)ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో సెబ్ను రద్దు చేయాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో సెబ్లో పనిచేస్తున్న 4,393 మంది ఉద్యోగులను తిరిగి ఎక్సైజ్ శాఖలోకి తీసుకురానున్నారు. ఇకపై వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణలో విధులు నిర్వహించనున్నారు. అలాగే సెబ్ కింద ఉన్న 208 స్టేషన్లు ఇకపై ఎక్సైజ్ స్టేషన్లుగా ఉండనున్నాయి.
Similar News
News November 23, 2025
సిద్దిపేట: ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దు: సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలు చేపట్టవద్దని పోలీస్ కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు. కావున అనుమతి లేకుండా ర్యాలీలు, సభలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీస్ అనుమతి తీసుకోవాలని సూచించారు.

మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ: మంత్రి

మక్తల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్ఆర్పీటీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోందని తెలిపారు.