News June 25, 2024

BREAKING: ఆస్ట్రేలియా ఇంటికి.. సెమీఫైనల్‌‌కు అఫ్గానిస్థాన్

image

T20 WC-2024లో అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌‌కు చేరింది. బంగ్లాపై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో అద్భుత విజయంతో ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. 116 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్ దాస్ (54*)ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టాయి. సూపర్ 8 గ్రూప్-1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. సెమీస్‌లో సౌతాఫ్రికా-అఫ్గానిస్థాన్, భారత్-ఇంగ్లండ్ తలపడనున్నాయి.

Similar News

News April 10, 2026

ట్రంప్ చెప్పినా డోంట్ కేర్.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు!

image

సీజ్‌ఫైర్ చర్చల వేళ దాడులను తగ్గించాలని US అధ్యక్షుడు ట్రంప్ చెప్పినా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు. ఇవాళ మరోసారి లెబనాన్‌పై విరుచుకుపడింది. 2 టౌన్లపై వైమానిక దాడులు చేసింది. దీంతో తామూ ఇజ్రాయెల్‌లోని ఖిర్యాత్ షిమోనాపై రాకెట్లతో అటాక్ చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్, US దురాక్రమణ ఆగే వరకు వెనక్కి తగ్గబోమని స్పష్టంచేసింది. బీరుట్‌పై ఇజ్రాయెల్ <<19611886>>దాడుల్లో<<>> 303 మందికి పైగా చనిపోవడం తెలిసిందే.

News April 10, 2026

‘జననాయగన్’ పైరసీ.. చిరంజీవి ఆందోళన

image

దళపతి విజయ్ నటించిన చివరి సినిమా ‘జననాయగన్’ రిలీజ్‌కు ముందే <<19610254>>పైరసీ<<>> కావడంపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. మూవీ లీక్ అవ్వడం కలవరపెడుతోందని, ఇలాంటిది పరిశ్రమలోని అందరికీ జరగొచ్చని ఆయన పేర్కొన్నారు. పైరసీని అంతం చేయాలని, దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కళాకారుల ప్రతిభ, కష్టాన్ని గౌరవించాలని.. థియేటర్లలోనే మూవీ చూడాలని తమిళ హీరో శివకార్తికేయన్ సూచించారు.

News April 10, 2026

NCLలో 577 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

image

నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్(NCL)లో 577 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డంపర్/గ్రేడర్/డోజర్/సర్ఫేజ్ మైనర్ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ఓవర్‌సీర్(సివిల్) పోస్టులున్నాయి. జాబును బట్టి 55% మార్కులతో టెన్త్, హెవీ మోటార్ వెహికల్/ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్, ఇంటర్, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ మే-1. పూర్తి వివరాలకు www.nclcil.in చూడండి.