News July 13, 2024

ఉపఎన్నికల్లో బీజేపీకి షాక్

image

దేశంలోని 13 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాల్లో BJPకి ఎదురుదెబ్బ తగిలింది. 11 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 2చోట్ల మాత్రమే గెలిచింది. మొత్తం 13స్థానాల్లో కాంగ్రెస్ 4, TMC 4, AAP 1, DMK 1, ఇండిపెండెంట్ ఒక చోట విజయం సాధించారు. బెంగాల్‌లో TMC క్లీన్ స్వీప్ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ 2 సీట్ల చొప్పున కైవసం చేసుకుంది. పంజాబ్‌లో AAP, తమిళనాడులో DMK, బిహార్‌లో IND గెలిచారు.

Similar News

News April 9, 2026

జూన్ 2 నుంచి స్కూల్ విద్యార్థులకు అల్పాహారం

image

TG: జూన్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు వివరించారు. అలాగే 100 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభిస్తామని చెప్పారు. అంతరాలు లేని, ఆదర్శ సమాజం విద్య ద్వారానే సాధ్యమని వివరించారు.

News April 9, 2026

సీజ్‌ఫైర్‌పై కన్‌ఫ్యూజన్.. మార్కెట్లకు నష్టాల టెన్షన్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 947 పాయింట్లు కోల్పోయి 76,615కు చేరగా నిఫ్టీ 222 పాయింట్లు కోల్పోయి 23,775 వద్ద స్థిరపడింది. సీజ్‌ఫైర్‌పై గందరగోళం నెలకొనడం, ఒప్పందం జరిగే వరకు అమెరికా సేనలు ఇరాన్‌ను వీడవని ట్రంప్ ప్రకటించడం మార్కెట్లపై ప్రభావం చూపించింది. FII సెల్లింగ్, గ్లోబల్ మార్కెట్ల పతనం, ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈరోజు మార్కెట్లు డీలా పడటానికి కారణమయ్యాయి.

News April 9, 2026

ఆస్కార్స్ 100వ వేడుక.. డేట్స్ ఫిక్స్

image

2028 మార్చి 5న ఆస్కార్స్ వందో అవార్డుల ఫంక్షన్ జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు. 2027 మార్చి 14న 99వ ఆస్కార్స్ నిర్వహిస్తామన్నారు. ఈ రెండు ఈవెంట్స్ లాస్ ఏంజెలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి. 2029 నుంచి వేడుకలను LAలోని పీకాక్ థియేటర్‌కు మారుస్తారు. అలాగే ప్రస్తుత బ్రాడ్‌కాస్టర్ ABC కాంట్రాక్ట్ కూడా 2028తో ముగియనుంది. 2029 నుంచి ఆస్కార్స్ యూట్యూబ్‌లో లైవ్ టెలికాస్ట్ కానుంది.