News April 12, 2024

BREAKING: లక్నోకు షాక్.. ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

image

IPL-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో మెక్‌గర్క్ 55, పంత్ 41, పృథ్వీ షా 32 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా లక్నోకు రెండో ఓటమి.

Similar News

News March 16, 2026

గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

image

LPG సిలిండర్ల సరఫరాలో అంతరాయం నెలకొన్న నేపథ్యంలో బుకింగ్ & డెలివరీ సమయంలో ఆటంకాలు రావొద్దంటే వెంటనే eKYC పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. సబ్సిడీ ఆగిపోకుండా, కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలంటే ఇది తప్పనిసరని పేర్కొంది. దీనికోసం1800 233 3555 నంబర్‌కు లేదా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించండి. లేకపోతే మీ ఆయిల్ కంపెనీ యాప్‌ డౌన్‌లోడ్ చేసి ‘Aadhaar FaceRD’ యాప్‌ సాయంతో ఇంటి నుంచే KYC చేసుకోవచ్చు. SHARE IT

News March 16, 2026

నేడే రాజ్యసభ ఎన్నికలు.. బరిలో నితీశ్ కుమార్

image

రాజ్యసభలో 37 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. TG(2 స్థానాలు)తో పాటు బెంగాల్, అస్సాం, బిహార్, TN, MH, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హరియాణా, HPలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 26 స్థానాలు ఏకగ్రీవం కానుండగా 11 సీట్ల కోసం పోలింగ్ నిర్వహిస్తారు. బిహార్ CM నితీశ్ కుమార్, BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. MPగా ఎన్నికయ్యాక CM పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశముంది.

News March 16, 2026

జూన్‌లో 2 ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన?

image

TG: వరంగల్(D) మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి PM మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామునూరుకు రూ.850 కోట్లు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు రూ.1,061 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ పౌర, మిలిటరీ విమానాలు ల్యాండయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. అలాగే డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తారని సమాచారం.