News September 12, 2024
BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్ను మూశారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో గత నెల 19 నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 1992 నుంచి ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు.
Similar News
News December 4, 2025
HYD: త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తిమంతం: రంగారావు

త్రివిధ దళాల్లో నౌకాదళం శక్తివంతమైందని, దేశ రక్షణలో కీలకమని నేవీ విశ్రాంత ఆఫీసర్ DP రంగారావు అన్నారు. ‘1969-80 వరకు పని చేశాను. 1971 WARలో ఉన్నాను. 1970-76లో ఒకే షిప్లో 6 ఏళ్లు 28 దేశాలు ప్రయాణించాను. 1976లో INS వీరబాహు సబ్ మెరైన్ బేస్ మెయింటెనెన్స్ మెరైన్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించాను. సంగ్రామ్ మెడల్, పశ్చిమ స్టార్ మెడల్స్ అందుకున్నాను’ అని నేవీ డే వేళ హయత్‌నగర్‌లో ఆయన Way2Newsతో మాట్లాడారు.
News December 4, 2025
179 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇంపాల్‌లో 179 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, పీజీ, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.57,700 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://cau.ac.in/
News December 4, 2025
దీపం కొండెక్కింది అని ఎందుకు అంటారు?

దీపం ఆరిపోవడాన్ని మనం ‘దీపం కొండెక్కింది’ అని అంటాం. దీని వెనుక ఓ ఆధ్యాత్మిక కారణం ఉంది. సాధారణంగా మనం పర్వతాలను దైవ నివాసాలుగా భావిస్తాం. కొండలు దేవతలకు ఆశ్రయం ఇస్తాయని నమ్ముతాం. అయితే, దీపం జ్యోతి ఆరిపోయినప్పుడు, అది భౌతిక దేహాన్ని విడిచి, నేరుగా దైవంలో కలిసిపోయింది అని భావించాలి. దీపం దైవంలో ఐక్యమైందని చెప్పడానికే మనం ఆధ్యాత్మిక వ్యక్తీకరణను ఉపయోగిస్తూ ఇలా చెబుతుంటాం.


