News June 27, 2024

BREAKING: ఫైనల్‌కు సౌతాఫ్రికా

image

T20WC: అఫ్గానిస్థాన్ ఆశలు గల్లంతయ్యాయి. సెమీఫైనల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సౌతాఫ్రికా ఫైనల్లో అడుగుపెట్టింది. అఫ్గాన్ నిర్దేశించిన 57 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. డికాక్ (5) ప్రారంభంలోనే ఔట్ అయినా కెప్టెన్ మార్క్రమ్ (23*), హెండ్రిక్స్ (29*) తమ జట్టుకు విజయాన్ని అందించారు. అంతకుముందు బ్యాటర్ల ఘోర వైఫల్యంతో అఫ్గాన్ 56 పరుగులకే ఆలౌట్ అయింది.

Similar News

News April 8, 2026

పాకిస్థాన్‌ను ఇరాన్ ఎందుకు నమ్మింది?

image

అరబ్ దేశాలకు అమెరికాతో మంచి సంబంధాలు ఉండటం, సైనికులకు ఆశ్రయం ఇవ్వడంతో ఇరాన్ వాటిని నమ్మలేదు. ఇరాన్‌తో పాకిస్థాన్ సరిహద్దును పంచుకుంటోంది. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు బలంగా ఉన్నాయి. ఇరాన్ మంత్రి అరాఘ్చీ.. షరీఫ్, మునీర్‌ను ‘ప్రియమైన సోదరులు’ అని సంబోధించారు కూడా. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్‌తో పాక్‌కు మెరుగైన సంబంధాలు లేకపోవడం అతి ముఖ్య కారణం.

News April 8, 2026

ఇరాన్-అమెరికా సీజ్‌ఫైర్.. చైనా మాస్టర్ ప్లాన్!

image

అమెరికా-ఇరాన్ మధ్య సీజ్‌ఫైర్ విషయంలో అసలు చక్రం తిప్పింది చైనా అని తెలుస్తోంది. చర్చలకు అంగీకరించని ఇరాన్‌ను బీజింగ్ ఒప్పించినట్లు టాక్. తుర్కియే, పాక్, గల్ఫ్ దేశాలతో మాట్లాడుతూ ఈ డీల్‌ను సెట్ చేసిందని సమాచారం. ఈ విషయాన్ని ట్రంప్ కూడా పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. ఇరాన్-చైనా మధ్య సత్సంబంధాలున్నాయి. టెహ్రాన్ నుంచి బీజింగ్ పెద్ద ఎత్తున చమురు కొంటోంది.

News April 8, 2026

అట్లీతో సినిమా.. అల్లు అర్జున్ షాకింగ్ లుక్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న AA22 సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ గుండుతో షాకింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. బన్ని లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.