News April 9, 2024
BREAKING: ఉత్కంఠ పోరులో SRH విజయం

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 రన్స్ తేడాతో గెలిచింది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 180/6 స్కోరుకు పరిమితమైంది. PBKS బ్యాటర్లు శశాంక్ 46*, అశుతోశ్ 33* చివర్లో వరుసగా బౌండరీలు బాదడంతో ఓ దశలో పంజాబ్ గెలిచేటట్లే కనిపించింది. SRH బౌలర్లలో భువనేశ్వర్ 2, నటరాజన్, ఉనాద్కత్, కమిన్స్, నితీశ్ తలో వికెట్ పడగొట్టారు.
Similar News
News January 19, 2026
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.
News January 19, 2026
ఖమేనీపై దాడి జరిగితే పూర్తి స్థాయి యుద్ధమే: ఇరాన్

తమ ప్రజల కష్టాలకు అమెరికా, దాని మిత్రదేశాలే ప్రధాన కారణమని ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆరోపించారు. అమానవీయ ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు. దురాక్రమణకు ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. తమ సుప్రీం లీడర్ ఖమేనీపై దాడి జరిగితే అది ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధంతో సమానమని స్పష్టం చేశారు. ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇలా స్పందించారు.
News January 19, 2026
రాష్ట్రంలో 198 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

TGSRTCలో 198 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, డిప్లొమా, BE, BTech అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు 114 ఉన్నాయి. వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tgprb.in * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


