News December 1, 2024
BREAKING: ఆగిన జియో నెట్‌వర్క్

దేశంలోని చాలా ప్రాంతాల్లో జియో నెట్‌వర్క్ స్తంభించిపోయింది. ఫోన్ కాల్స్ వెళ్లకపోవడం, స్లో ఇంటర్నెట్, కొన్ని వెబ్‌సైట్లు అసలే ఓపెన్ కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న యూజర్లు సోషల్ మీడియా వేదికగా టెలికం సంస్థకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు తమకు 4గంటలుగా సర్వీస్ సరిగా లేదని వాపోతున్నారు. దీనిపై సంస్థ స్పందించాల్సి ఉంది. మీరూ జియో యూజరా? మీకు ఈ సమస్య ఎదురైందా? కామెంట్ చేయండి.
Similar News
News March 11, 2026
IPL వాయిదా పడుతుందా?

MAR 28 నుంచి ప్రారంభం కావాల్సిన IPL యుద్ధంతో వాయిదా పడుతుందా? అనే సందేహం నెలకొంది. ఆటగాళ్లకు హోటళ్లలో గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ ఆలస్యమైంది. ఇక విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల ఫారిన్ ప్లేయర్లు రావడంపైనా అనుమానాలున్నాయి. టోర్నీ ప్రారంభం నాటికి పరిస్థితులు అదుపులోకి రాకపోతే ప్రత్యామ్నాయాలు వెతుకుతాం అని IPL ఛైర్మన్ చెప్పారు.
News March 11, 2026
రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.
News March 11, 2026
GAILలో 70 పోస్టులు.. మార్చి 18 చివరి తేదీ

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com


