News July 5, 2024
BREAKING: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి

TG: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుత సీఈఓ వికాస్‌రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది.
Similar News
News November 18, 2025
ప్రతీ ఆటో డ్రైవర్‌కు రూ.5 లక్షల బీమా.. KTR హామీ

సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లందరికీ రూ.5 లక్షల ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో సోమవారం సిరిసిల్ల ఆటో డ్రైవర్లతో సమావేశమైన ఆయన నియోజకవర్గానికి చెందిన 5 వేల మంది ఆటోడ్రైవర్లకు వ్యక్తిగతంగా తానే ప్రమాద బీమా చెల్లిస్తానని ప్రకటించారు. ఆటోడ్రైవర్లకు అండగా ఉండటం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
News November 18, 2025
మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.
News November 18, 2025
టుడే టాప్ స్టోరీస్

* సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. 45మంది హైదరాబాదీలు సజీవదహనం
* ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు
* కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి DECలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని TG క్యాబినెట్ నిర్ణయం
* TG ఫిరాయింపు MLAల కేసులో స్పీకర్‌పై SC ఆగ్రహం
* బంగ్లా మాజీ PM హసీనాకు మరణశిక్ష


