News June 3, 2024
BREAKING: పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు
AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే <<13354570>>పిన్నెల్లి<<>> రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆయనను ఆదేశించింది. అలాగే బెయిల్‌ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. EVM ధ్వంసం కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2025
‘సెంచరీ’ కొట్టేందుకు షార్ సన్నద్ధం
AP: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) వందో ప్రయోగం చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులో ఇస్రో ఇక్కడి నుంచి GSLV- F15 ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక వద్ద ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వందో ప్రయోగం అరుదైన మైలురాయి కావడంతో PM మోదీ హాజరవుతారని సమాచారం.
News January 22, 2025
ఏంటీ ‘బర్త్ టూరిజం’?
పిల్లలకు US పౌరసత్వం లభించాలనే ఉద్దేశంతో చాలామంది ఇతర దేశాల మహిళలు కాన్పు సమయానికి అక్కడికి వెళ్తుంటారు. దీన్నే ‘బర్త్ టూరిజం’ అంటారు. US అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన ట్రంప్ ఈ విధానానికి స్వస్తి పలికారు. బిడ్డకు జన్మనిచ్చే సమయానికి పేరెంట్స్ అమెరికా పౌరులు కాకపోయినా, తండ్రి లేదా తల్లి శాశ్వత నివాసి కాకపోయినా, తాత్కాలిక వీసాపై నివాసం ఉన్నా.. వారికి పుట్టబోయే బిడ్డకు జన్మత: అక్కడి పౌరసత్వం వర్తించదు.
News January 22, 2025
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. కర్నూలు వాసులు మృతి
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు మరణించారు. రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.