News July 23, 2024

BREAKING: ‘నీట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

image

నీట్-యూజీ పరీక్ష మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకైందని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై ఆయన ఈ తీర్పు వెలువరించారు. నీట్ పేపర్ లీకేజీ వాస్తవమేనని, కానీ దేశమంతా జరిగిందని చెప్పలేమన్నారు. లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హజారీబాగ్, పట్నాలో కాపీ జరిగినట్లు పేర్కొన్నారు.

Similar News

News March 31, 2026

BREAKING: చిత్తుగా ఓడిన చెన్నై

image

IPL: గువాహటి వేదికగా RRతో ఆడిన మ్యాచ్‌లో CSK 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. 128 పరుగుల లక్ష్యాన్ని RR 12.1 ఓవర్లలోనే ఛేదించింది. వైభవ్ 17 బంతుల్లో 52, జైస్వాల్ 38*, జురెల్ 18, పరాగ్ 14* పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన CSK జట్టులో ఓవర్టన్(43), కార్తీక్(18), సర్ఫరాజ్(17) మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆర్చర్, బర్గర్, జడేజా తలా 2, బ్రిజేశ్, సందీప్, బిష్ణోయ్ తలా వికెట్ తీశారు.

News March 30, 2026

హార్ముజ్ వద్ద భారత నౌకలకు ఛార్జీ లేదు: కేంద్రం

image

హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలకు ఇరాన్ అనుమతులు, ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. ఆ మార్గం ఇరుకుగా ఉండటంతోనే నౌకలు రావడం ఆలస్యమవుతోందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ తెలిపారు. ‘92వేల టన్నుల గ్యాస్‌తో 2 నౌకలు అక్కడి నుంచి బయలుదేరాయి. మరో 20 నౌకలు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్నాయి. ఇందులో 5 LPG, 4 క్రూడాయిల్ ఓడలున్నాయి’ అని చెప్పారు.

News March 30, 2026

జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్‌ ముదిరిపోయింది: టీడీపీ

image

AP: మూలపేట <<19518755>>పోర్టును<<>> 70% తానే పూర్తి చేసినట్లు జగన్ చెప్పుకుంటున్నారని టీడీపీ విమర్శించింది. ఆయనకు క్రెడిట్ చోరీ డిజార్డర్‌ ముదిరిపోయిందని ట్వీట్ చేసింది. ‘నిజానికి అది భావనపాడు పోర్టు. దాని పనులు అంతకుముందు టీడీపీ హయాంలోనే ప్రారంభమయ్యాయి. YCP హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం వేగవంతం చేయగానే జగన్ క్రెడిట్ చోరీ మొదలు పెట్టాడు’ అని మండిపడింది.