News April 11, 2025

BREAKING: తహవూర్ రాణాకు 18రోజుల రిమాండ్

image

ముంబై బాంబు దాడుల కీలక సూత్రధారి, నరహంతకుడు తహవూర్ రాణాను NIA ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని విచారించేందుకు రిమాండ్‌కు అప్పగించాలన్న సంస్థ విజ్ఞప్తిని న్యాయస్థానం మన్నించింది. రాణాకు 18రోజుల రిమాండ్‌ను విధిస్తున్నట్లు తెలిపింది.

Similar News

News April 6, 2026

ప్రజావాణి.. ప్రజల వినతులకు తక్షణ స్పందన: MBNR ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (Grievance Day) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం పోలీస్ శాఖ ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు.

News April 6, 2026

మనిషిలాగే ఈ జంతువుకూ వేలిముద్రలు!

image

ప్రకృతి సృష్టించిన వింతల్లో ఆస్ట్రేలియాకు చెందిన కోలాల జంతువులు ఒకటి. వీటి వేలిముద్రలు అచ్చం మనుషులకు ఉన్నట్లే ఉంటాయి. కోలాలు, మానవులు వేర్వేరు జాతులైనప్పటికీ.. చెట్ల కొమ్మలను గట్టిగా పట్టుకోవడానికి వీలుగా జీవ పరిణామ క్రమంలో ఇవి ఏర్పడ్డాయి. మైక్రోస్కోప్‌తో చూసినా మానవ, కోలా వేలిముద్రల మధ్య తేడాను కనిపెట్టడం నిపుణులకు సైతం అసాధ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(39/100)

News April 6, 2026

రేపు పిడుగులతో వర్షాలు!

image

AP: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని తెలిపింది. అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందంది. ఇవాళ అనంతపురం(D) తెరన్నపల్లిలో 42, కడప(D) రాజుపాలెంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.