News March 28, 2025

BREAKING: టెన్త్ పరీక్ష వాయిదా

image

AP: ఈనెల 31న జరగాల్సిన టెన్త్ సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ ఎగ్జామ్‌ను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 31న స్టోరేజీ పాయింట్ల నుంచి ప్రశ్నపత్రాలు, మెటీరియల్‌ను తీసుకెళ్లొద్దని సిబ్బందికి స్పష్టం చేశారు. కాగా పరీక్షల షెడ్యూల్ విడుదల సమయంలోనే చివరి ఎగ్జామ్ తేదీ విషయంలో మార్పు ఉండొచ్చని పేర్కొన్న విషయం తెలిసిందే.

Similar News

News November 15, 2025

PGIMERలో 151 పోస్టులు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<>PGIMER<<>>) 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC,STలకు రూ.800, దివ్యాంగులకు ఫీజు లేదు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, MA/MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

News November 15, 2025

హనుమాన్ చాలీసా భావం – 10

image

భీమరూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే ||
ఆంజనేయుడు భయంకరమైన, భీకరమైన రూపాన్ని ధరించి, శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. తన సొంత ప్రయోజనం కోసం కాకుండా, శ్రీ రామచంద్రుడను నమ్మి ఆయన ముఖ్య కార్యాలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఎంతటి శక్తి ఉన్నా.. ఆ బలాన్ని ఉత్తమ ధర్మాన్ని నిలబెట్టడానికి, దైవ కార్యాలను నెరవేర్చడానికి మాత్రమే ఉపయోగించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 15, 2025

ఈ ఊరి ప్రజలు తిరుమలకు వెళ్లరు.. ఎందుకంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోని ఓ ఊరు ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లా(TG) మల్దకల్‌ ప్రజలు తిరుమలకు వెళ్లరు. దీనికి కారణం ఆ ఊరిలోనే వెలసిన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) ఆలయం. తమ స్థానిక దైవమైన తిమ్మప్పనే తిరుమలేశుడిగా భావించి పూజిస్తారు. ఇక్కడ ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి రోజున తిరునాళ్లు నిర్వహిస్తారు. ప్రజలు తమ ఇళ్లను ఆలయ గోపురం కంటే ఎత్తుగా నిర్మించరు.