News July 6, 2024
BREAKING: ఏడాదికి 2 సార్లు టెట్

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. జూన్, డిసెంబర్ నెలల్లో టెట్ పరీక్ష నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అభ్యర్థి ఎన్ని సార్లైనా టెట్ రాసుకోవచ్చని జీవోలో పేర్కొంది. డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది.
Similar News
News December 29, 2025
11 నెలల్లో SCRకు రూ.19,314 కోట్ల ఆదాయం

ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే(SCR)కు రూ.19,314 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే(రూ.18,831 కోట్లు) ఇది రూ.483 కోట్లు అధికమని పేర్కొన్నారు. రైళ్ల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు సంక్రాంతి రద్దీ నేపథ్యంలో JAN 7-12 వరకు మరో 11 ప్రత్యేక రైళ్ల బుకింగ్ ఇవాళ ఉ.8 గంటలకు మొదలుకానుంది.
News December 29, 2025
RSS అల్‌ఖైదా లాంటిది: మాణికం ఠాగూర్

RSSను ఉగ్ర సంస్థ అల్‌ఖైదాతో పోలుస్తూ కాంగ్రెస్ MP మాణికం ఠాగూర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘RSS విద్వేషాన్ని వ్యాప్తి చేసే సంస్థ. అల్‌ఖైదా లాంటిది. దాని నుంచి <<18686086>>నేర్చుకోవడానికి<<>> ఏమీ లేదు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చింది. ప్రజా ఉద్యమంగా పార్టీని గాంధీ మార్చారు. అలాంటి పార్టీ ఈ సంస్థ నుంచి నేర్చుకోవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ హద్దు దాటుతోందని BJP మండిపడింది.
News December 29, 2025
డెలివరీ తర్వాత ఈ సమస్య వస్తోందా?

కొంతమందిలో డెలివరీ తర్వాత నవ్వినా, తుమ్మినా, దగ్గినా, ఇతర ఒత్తిడికరమైన పనులు చేసినా మూత్రాశయం నియంత్రణ కోల్పోతుంది. దీంతో మూత్రం లీక్ అవుతుంది. హార్మోన్లు, టిష్యూల లాక్సిటీ వలన ఇలా జరుగుతుంది. బ్లాడర్ గోడకు సపోర్ట్‌గా ఉండే ఈ టిష్యూలు డెలివరీ టైంలో దెబ్బతింటాయి. సాధారణంగా కొంత కాలానికి సమస్య తగ్గుతుంది. తగ్గకపోతే ఇంట్లోనే కెగెల్ వ్యాయామాలు చెయ్యాలి. అప్పటికీ సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి.


