News December 27, 2024
రేపు వారి టెట్ హాల్ టికెట్లు విడుదల

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. టెట్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2025 JAN 2 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. సాంకేతిక సమస్య వల్ల JAN 11న ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ పేర్కొంది.
Similar News
News November 21, 2025
యాదాద్రికి కార్తీక మాసంలో ₹17.62 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈసారి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నెల రోజులలో ఆలయానికి ₹17,62,33,331 చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు అధికంగా లభించాయి. ఈ మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News November 21, 2025
NCCDలో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్చైన్ డెవలప్మెంట్ (NCCD) 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8వరకు అప్లై చేసుకోవచ్చు. contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.
News November 21, 2025
రాజధాని రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం: నారాయణ

AP: రాజధానిలో రైతులకిచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల కల్పన వేగంగా జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలోని పలు గ్రామాల్లో పర్యటించి మాట్లాడారు. ‘69,421 మంది రైతులకు 61,433 ప్లాట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 991మంది రైతులకే ప్లాట్లు కేటాయించాల్సి ఉంది. కొందరు తమకు కావాల్సిన చోట ప్లాట్లు అడుగుతున్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగదు. ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం’ అని మంత్రి స్పష్టం చేశారు.


