News August 22, 2024
41 ఏళ్ల టెస్టు రికార్డు బద్దలు

ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో శ్రీలంక ప్లేయర్ మిలన్ రత్నాయక్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగి అత్యధిక స్కోర్(72) చేసిన ఆటగాడిగా నిలిచారు. 1983లో భారత ప్లేయర్ బల్వీందర్ సంధు పాక్పై చేసిన 71 స్కోర్ రికార్డును 41 ఏళ్ల తర్వాత మిలన్ బ్రేక్ చేశారు. డెబ్యూ మ్యాచ్లోనే ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్గానూ చరిత్ర పుటల్లో తన పేరు నమోదు చేసుకున్నారు.
Similar News
News January 30, 2026
కళ్లు మూసి తెరిచేలోపే SMలో ఇంత జరుగుతుందా?

సోషల్ మీడియాలో ఒక్క సెకనులో ఏం జరుగుతుందో గూగుల్ GEMINI ఆసక్తికర డేటాను వెల్లడించింది. దీని ప్రకారం సెకనుకు వాట్సాప్లో 10 లక్షల మెసేజ్లు, ఇన్స్టాలో 1,000 ఫొటోలు అప్లోడ్ అవుతున్నాయి. ‘X’లో 10 వేల ట్వీట్స్ చేస్తుంటే గూగుల్లో లక్షకు పైగా సెర్చ్లు జరుగుతున్నాయి. ఇక యూట్యూబ్లో 90 వేల వీడియోలు చూస్తున్నారు. మనం కనురెప్ప వేసి తెరిచేలోపు డిజిటల్ ప్రపంచం ఇంతలా కదులుతోందన్నమాట.
News January 30, 2026
చర్చలకు మాస్కో రండి.. జెలెన్స్కీకి రష్యా ఆహ్వానం

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని శాంతి చర్చలకు మాస్కో రావాలని రష్యా ఆహ్వానించింది. అయితే ఈ విషయంపై ఆయన నుంచి ఇంకా స్పందన రాలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. గతేడాది రష్యా పంపిన ఆహ్వానాన్ని జెలెన్స్కీ తిరస్కరించారు. తన దేశంపై మిసైళ్లు ప్రయోగిస్తున్న దేశానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు.
News January 30, 2026
WPL: ఫైనల్కు దూసుకెళ్లిన ఆర్సీబీ

WPLలో ఆర్సీబీ ఫైనల్కు దూసుకెళ్లింది. ఇవాళ యూపీ వారియర్స్పై గెలుపుతో 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. యూపీ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 2 వికెట్లు కోల్పోయి 13.1 ఓవర్లలోనే ఛేదించింది. గ్రేస్ హారిస్(75), స్మృతి మంధాన(54*) చెలరేగి ఆడారు. యూపీ బౌలర్లలో శిఖా పాండే, ఆశా శోభన తలో వికెట్ పడగొట్టారు. తాజా ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి యూపీ నిష్క్రమించింది.


