News May 15, 2024
BREAKING: రాష్ట్రంలో 10 రోజులు థియేటర్లు బంద్

ఆక్యుపెన్సీ తక్కువ ఉండటంతో తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమాన్యాలు తాత్కాలిక విరామం ప్రకటించాయి. శుక్రవారం నుంచి పది రోజుల పాటు షోలు వేయవద్దని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఎన్నికలు, ఇతర కారణాలతో ఇటీవల పెద్ద సినిమాలు విడుదల కాలేదు. దీంతో సినిమా హాళ్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. నగరాలతో పోలిస్తే పట్టణాలు, మండలాల్లో ఇది మరింత ఎక్కువ ఉంది.
Similar News
News March 10, 2026
గడ్డి మందు పిచికారీ – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కలుపు నివారణకు పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పిచికారీ చేస్తున్నారు. ఈ మందు పొరపాటున గాలి ద్వారా శరీరంలోకి వెళ్తే లంగ్స్, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. తక్కువ సమయంలోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో మరణం సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే గడ్డి మందును పిచికారీ చేసేటప్పుడు రైతులు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించాలి.
News March 10, 2026
కలుపు ముప్పు తగ్గాలంటే ఇలా చేయాలి

పంట వేసేందుకు పొలాన్ని 2 నుంచి 3 దఫాలుగా దున్నడం వల్ల తొలిదశలోనే కలుపు విత్తనాలు మెులిచి మున్ముందు కలుపు సమస్య అంతగా ఉండదు. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్స్, పంట వ్యర్థాలను, వరి గడ్డిని నేలపై చదునుగా పరచడం, అంతరకృషి వంటివి కలుపును తగ్గించి పంటకు, నేలకు మేలు చేస్తుందనే వాస్తవాన్ని రైతులు తెలుసుకోవాలి. కలుపు మందును వాడాల్సి వస్తే తప్పకుండా నిపుణులు సూచన మేరకే వాడాలి. వ్యాపారుల ప్రమేయం ఉండకపోవడం మంచిది.
News March 10, 2026
టీమ్ ఇండియాకు రూ.131 కోట్లు

T20WC సొంతం చేసుకున్న టీమ్ ఇండియాకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఏకంగా రూ.131 కోట్ల భారీ రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్ స్టాఫ్, కోచింగ్ బృందానికి ఈ మొత్తాన్ని అందజేయనుంది. వరుసగా రెండుసార్లు, మొత్తం మూడు సార్లు ట్రోఫీని సాధించినందుకు కంగ్రాట్స్ చెప్పింది.


