News January 30, 2025
BREAKING: వారి రిటైర్మెంట్ వయసు పెంపు

TG: యూనివర్సిటీ అధ్యాపకుల రిటైర్మెంట్ వయసును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలోని UGC వేతన స్కేల్ పొందుతున్న అధ్యాపకులకే ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి. సీనియర్ ఫ్యాకల్టీ సేవలను వినియోగించుకునేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వరా? అంటూ దీనిపై నిరుద్యోగ జేఏసీ మండిపడుతోంది.
Similar News
News November 1, 2025
వరంగల్ కబ్జాలపై సీఎం రేవంత్ ఉక్కుపాదం

వరంగల్ వరదల నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, నాళాలపై కబ్జాలు చేసిన వారిని ఎంత పెద్దవారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో ఇరిగేషన్ శాఖతో అన్ని విభాగాలు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. ముంపు ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడంలో నిర్లక్ష్యం వదలాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలని ఆదేశించారు.
News November 1, 2025
IPL: LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్?

IPL-2026లో LSG హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్ వ్యవహరించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఆ ఫ్రాంఛైజీ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గత సీజన్లో LSG కోచ్గా ఆసీస్ మాజీ ప్లేయర్ జస్టిన్ లాంగర్ పనిచేశారు. పంత్ కెప్టెన్గా ఉన్నారు. ఈ జట్టు పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానానికి పరిమితమైంది. కాగా ఇటీవల NZ క్రికెటర్ విలియమ్సన్ను స్ట్రాటజిక్ అడ్వైజర్గా నియమించింది.
News November 1, 2025
ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.


