News January 24, 2025

BREAKING: టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ను అందుబాటులో ఉంచనుంది.

Similar News

News November 25, 2025

జనగామ జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు

image

జనగామ జిల్లాలోని 280 పంచాయతీలు, 2534 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో చిల్పూరు, ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాల ఘనపురంలోని 110 జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2వ దశలో జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేటలోని 79 జీపీలకు, 3వ దశలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకొండ్లలోని 91 పంచాయతీలకు జరుగనున్నాయి.

News November 25, 2025

12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

image

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.

News November 25, 2025

T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

image

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.