News June 7, 2024

BREAKING: మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

image

దేశ ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ఎల్లుండి రాత్రి 7.15 గంటలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రముఖులు రానుండటంతో 2,500 మంది పోలీసులతోపాటు 5 కంపెనీల పారామిలిటరీ దళాలు బందోబస్తు నిర్వహించనున్నాయి.

Similar News

News December 1, 2025

WGL: వారెవ్వా.. ఇదేం కుటుంబ పాలన!

image

ఉమ్మడి WGL రాజకీయం కుటుంబ పాలనైంది. ఇదిలా ఉంటే చాలా నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులే అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. అల్లుళ్ల గిల్లుడుతో అధికారులు అల్లాడుతుండగా, మరో దగ్గర అత్త పెత్తనం, మరో రెండు చోట్ల కొడుకుల ఆర్డర్లతో అధికారులు నలిగిపోతున్నారు. ఒక దగ్గర “సన్”స్ట్రోక్ ఉండగా, మరో దగ్గర కొండంత దూరంలో భర్త పరుగులు పెట్టిస్తున్నాడు. గెలిచిన వాళ్లకంటే వారి కుటుంబీకులే కీలకంగా మారిపోయారనేది టాక్.

News December 1, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.660 పెరిగి రూ.1,30,480కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,19,600 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.4,000 పెరిగి రూ.1,96000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 1, 2025

ఈ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటే?

image

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాదినిధనో ధాతా విధాతా ధాతు రుత్తమః||
తనంతట తాను అవతరించిన శాంతి స్వరూపుడు, సూర్యుడికి జన్మనిచ్చిన కలువ పూల కన్నులు కలవాడు విష్ణుమూర్తి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి, నిర్మించి, పాలించే ఆయనను పూజించడం కన్నా మోక్ష మార్గం మరొకటి లేదు. అందుకే ఆ దివ్య మంగళ రూపాన్ని ధ్యానించాలి. అప్పుడే మనస్సుకు శాంతి లభిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>