News January 1, 2025
BREAKING: విషాదం.. చిన్నారి చేతన మృతి
రాజస్థాన్ బోర్ బావి ఘటన విషాదాంతమైంది. 10 రోజులపాటు లోపల నరకం అనుభవించి కొనఊపిరితో ఉన్న చేతన(3)ను <<15040225>>ఇవాళ బయటకు<<>> తీసుకురాగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో పేరెంట్స్, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గతేడాది డిసెంబర్ 23న 150 అడుగుల లోతున్న బోరులో చిన్నారి పడిపోయింది. 10 రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.
Similar News
News January 4, 2025
తెలుగు భాషను కాపాడుకోవాలి: కిషన్ రెడ్డి
తెలుగు భాషను మాట్లాడటం, రాయడం ద్వారానే పరిరక్షించగలమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. HYDలో తెలుగు సమాఖ్య మహాసభల్లో ఆయన మాట్లాడారు. బోధన భాషగా తెలుగును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని సూచించారు. పాలన, అధికార వ్యవహారాలు తెలుగులోనే జరిగేలా చూడాలని AP, TG ప్రభుత్వాలను కోరారు. వాడుక భాషలో 30% తెలుగు, 70% ఇంగ్లిష్ ఉంటోందని.. ఇలా అయితే మనకు తెలియకుండానే తెలుగు కనుమరుగవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News January 4, 2025
BREAKING: ఢిల్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన BJP
ఢిల్లీ ఎన్నికలకు BJP సమర శంఖం పూరించింది. 29 మందితో MLA అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. న్యూఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్‌పై పర్వేశ్ వర్మ పోటీపడనున్నారు. కాల్కాజీలో CM ఆతిశీని రమేశ్ బిధూరీ ఢీకొంటారు. కరోల్‌బాగ్ నుంచి దుష్యంత్ గౌతమ్, రాజౌరీ గార్డెన్ నుంచి మజిందర్ సింగ్, బిజ్వాసన్ నుంచి కైలాష్ గహ్లోత్, గాంధీ నగర్ నుంచి అర్విందర్ సింగ్ పోటీ చేస్తున్నారు.
News January 4, 2025
కోహ్లీది అదే కథ!
‘KOHLI LOVES SLIPS’ అన్న ట్రోల్స్ నిజం చేస్తూ BGT చివరి ఇన్నింగ్స్‌లోనూ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి కోహ్లీ ఔట్ అయ్యారు. ఈ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 8సార్లు కోహ్లీ ఇలాగే పెవిలియన్‌కు చేరడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకేలా ఔట్ అవుతున్నా ఆటశైలి మారకపోవడంతో రిటైర్ అవ్వాలనే డిమాండ్ విన్పిస్తోంది. కెరీర్ చివర్లో ఉన్న విరాట్ టెక్నిక్ మార్చుకోకపోతే టీంలో చోటు కోల్పోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.