News August 21, 2025

BREAKING: రాష్ట్రంలో విషాదం

image

AP: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేట(మం) బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని చనిపోయారు. మృతులు స్థానిక కాలేజీలో MBA చదువుతున్న దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. నిన్న కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో నీటి కుంటలో ఈతకు వెళ్లిన <<17465047>>ఆరుగురు <<>>చిన్నారులు మృతిచెందారు.

Similar News

News August 21, 2025

ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం

image

AP: పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో CM చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం చేసుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో ₹9వేల కోట్లతో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని వల్ల దాదాపు 10,000 మందికి ఉపాధి లభించనుంది. APని తూర్పు దేశాలకు సముద్ర ద్వారంగా, లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడానికి కట్టుబడినట్లు CM పేర్కొన్నారు.

News August 21, 2025

వివాదానికి శుభం కార్డు.. రేపటి నుంచి షూటింగ్‌లు షురూ!

image

ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ <<17429585>>ప్రొడ్యూసర్లు-ఫెడరేషన్<<>> మధ్య వివాదం సద్దుమణిగింది. దీంతో 18 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. కండీషన్లు, డిమాండ్లపై కాసేపట్లో ప్రకటన విడుదల కానుంది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి చర్చలు జరిపింది.

News August 21, 2025

రేపు ఫలితాలు విడుదల

image

AP: రేపు DSC మెరిట్ <<17459141>>లిస్ట్ <<>>విడుదల చేయనున్నట్లు కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. DSC సైటుతో పాటు జిల్లా విద్యాధికారి సైటులోనూ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో వివిధ కేటగిరీల పోస్టుల కాల్ లెటర్ పొందవచ్చని సూచించారు. లిస్టులో ఉన్న వారంతా ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన 3 సెట్ల జిరాక్సులు, 5 పాస్ పోర్టు ఫొటోలతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలిపారు.