News April 1, 2024

BREAKING: విచారణ వాయిదా

image

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో MLC కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. మార్చి 15న అరెస్టు అయిన కవిత.. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Similar News

News January 28, 2026

నిద్రలో శివుడు కనిపిస్తే..?

image

కలలో శివుడు కనిపించడం అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతోంది. శివుడికి సంబంధించి ఏ వస్తువు కనిపించినా కష్టాలు తీరుతాయని, త్వరలోనే శుభవార్తలు వింటారని అర్థం. శివలింగం కనిపిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గర్భవతులకు శివలింగం కనిపిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈశ్వరుడు కలలో రావడం భవిష్యత్తులో జరగబోయే శుభపరిణామాలకు సంకేతం.

News January 28, 2026

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. SSD టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 5 గంటలు పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లోని 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,049 మంది దర్శించుకోగా, 21,469 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చింది. టోకెన్‌ కలిగిన భక్తులు కేటాయించిన సమయానికే క్యూలోకి రావాలని TTD సూచించింది.

News January 28, 2026

వాట్సాప్‌లో హై సెక్యూరిటీ ఫీచర్‌

image

వాట్సాప్‌ ‘స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్’ పేరిట హై సెక్యూరిటీ ఫీచర్‌‌ను తీసుకొచ్చింది. ఆల్రెడీ యాప్‌లో డిఫాల్ట్‌గా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్నప్పటికీ అడిషనల్ సెక్యూరిటీ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే తెలియని నంబర్ల నుంచి వచ్చే మీడియా ఫైల్స్/అటాచ్‌మెంట్లు బ్లాక్ అవుతాయి. కాల్స్ మ్యూట్ అవుతాయి(రింగ్ అవ్వదు). ఏదైనా లింక్ వస్తే థంబ్‌నెయిల్/ప్రివ్యూ డిసేబుల్ అవుతుంది.