News February 5, 2025

BREAKING: ట్రంప్ సంచలన ప్రకటన!

image

US అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో జీవిస్తున్న 20లక్షలమంది పైచిలుకు పాలస్తీనీయులు ఆ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Similar News

News November 15, 2025

దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది: మ‌హేశ్ బాబు

image

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డాలో అంత క‌ష్ట‌ప‌డ‌తాను. అంద‌రూ గ‌ర్వప‌డేలా చేస్తాను. ముఖ్యంగా రాజ‌మౌళిని. ఇది విడుద‌లైన త‌ర‌వాత దేశ‌మంతా గ‌ర్వంగా ఫీల‌వుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయ‌మ‌ని నాన్న‌ అడుగుతుండేవారు. ఆయ‌న మాట‌లు ఎప్పుడూ విన‌లేదు. ఇప్పుడు ఆయ‌న నా మాట‌లు వింటుంటారు’ అని గ్లోబ్‌ట్రాటర్‌ ఈవెంట్‌‌లో మాట్లాడారు.

News November 15, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

image

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>

News November 15, 2025

రామాయ‌ణంలోని ముఖ్య‌ ఘ‌ట్టంతో ‘వారణాసి’: రాజ‌మౌళి

image

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొద‌లు పెట్టేట‌ప్పుడు రామాయ‌ణంలో ముఖ్య‌మైన ఘ‌ట్టం తీస్తున్నాన‌ని అస్స‌లు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద న‌డ‌వ‌డం లేదు, గాల్లో ఉన్నాన‌ని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్‌బంప్స్ వ‌చ్చాయని తెలిపారు.