News November 30, 2024
BREAKING: తీరాన్ని తాకిన తుఫాన్

ఫెంగల్ తుఫాన్ తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి.
Similar News
News November 13, 2025
ప్రహారీ దాటి ఇంటి నిర్మాణాలు ఉండొచ్చా?

ఇంటిని, ర్యాంపులను ప్రహరీ దాటి బయటికి నిర్మించడం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. రహదారిపైకి వచ్చేలా ర్యాంపులు కట్టడం వల్ల వీధుల్లో తిరిగే ప్రజలకు, వాహనాలకు అసౌకర్యం కలుగుతుందంటున్నారు. ‘వాస్తుకు అనుగుణంగా ఇంటి గేటు లోపలే ర్యాంపు ఉండాలి. ప్రజలకు చెందాల్సిన రహదారిని ఆక్రమించడం ధర్మం కాదు. ప్రహరీ లోపల నిర్మాణాలు చేస్తేనే వాస్తు ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 13, 2025
పంట ఉత్పత్తుల సేకరణ నిబంధనలు సడలించాలి: తుమ్మల

TG: వర్షాల ప్రభావం పడిన సోయాబీన్, మొక్కజొన్న, పత్తి సేకరణ నిబంధనలు సడలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. పంట ఉత్పత్తులు సేకరించేలా NAFED, NCCFలను ఆదేశించాలన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే సేకరించాలన్న CCI ప్రతిపాదనతో రైతులు నష్టపోతారని తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. L1, L2, స్పాట్ బుకింగ్లతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
News November 13, 2025
విశాఖలో 99పైసలకే రహేజాకు 27.10 ఎకరాలు

AP: VSP IT సెక్టార్లో 27.10 ఎకరాలు కేవలం 99 పైసలకే ‘రహేజా’కు ఇస్తూ ప్రభుత్వం GO ఇచ్చింది. అదనంగా ఆర్థిక రాయితీలు ఇస్తామంది. పైగా ₹91.20CRతో రోడ్లు, నీరు, విద్యుత్తు సౌకర్యాలు కల్పిస్తామంది. కాగా ₹2172.26 CRతో ఐటీ, రెసిడెన్షియల్ స్పేస్ నిర్మిస్తామని, 9681 జాబ్లు కల్పిస్తామని కంపెనీ చెబుతోంది. ₹కోట్ల విలువైన భూమిని సదుపాయాలు కల్పించి మరీ 99 పైసలకే ‘రియల్’ సంస్థకు ఇవ్వడంపై అనేక ప్రశ్నలొస్తున్నాయి.


