News March 26, 2025
BREAKING: UPI సర్వర్ డౌన్

దేశవ్యాప్తంగా యూపీఐ సర్వర్ డౌన్ అయ్యింది. పేమెంట్లు చేయడానికి వీలు కావట్లేదని, కనీసం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడమూ సాధ్యం కావట్లేదని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. UNABLE TO LOAD ACCOUNT అనే మెసేజ్ వస్తోందంటూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యూజర్లు ఫొటోలను షేర్ చేస్తున్నారు. పేమెంట్లు మధ్యలోనే నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. మీకూ ఇలాగే అయ్యిందా? కామెంట్ చేయండి.
Similar News
News January 29, 2026
‘ఫేర్‌వెల్ సాంగ్’.. నా మరణానంతరమే రిలీజ్: జాకీ చాన్

కుంగ్ ఫూ స్టార్ జాకీ చాన్ తన అభిమానులతో ఓ ఎమోషనల్ విషయాన్ని పంచుకున్నారు. తన మరణం తర్వాతే విడుదల చేయాలని ఒక ప్రత్యేక పాట రికార్డ్ చేయించుకున్నట్లు తెలిపారు. బీజింగ్‌లో జరిగిన తన కొత్త సినిమా వేడుకలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ పాట ప్రపంచానికి తానిచ్చే చివరి సందేశమని ఆయన తెలిపారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో భద్రపరిచి, అభిమానులకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
News January 29, 2026
నేతన్నలకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి కొత్త స్కీమ్

AP: మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. హ్యాండ్లూమ్ (మగ్గం)కు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఫ్రీ కరెంట్ ద్వారా 4 లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు. దీనివల్ల నెలకు రూ.85 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. 50 ఏళ్లకే నేతన్నలకు రూ.4 వేల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.
News January 29, 2026
చామంతి మొక్కల తలల కత్తిరింపుల వల్ల లాభమేంటి?

చామంతి సాగులో అధిక దిగుబడి రావాలంటే మొక్కల తలల కత్తిరింపు తప్పక చేపట్టాలి. పొలంలో మొక్కలన్నీ 30 సెంటీమీటర్లు దాకా పెరిగిన తర్వాత వాటి తలలను తుంచేయాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఫలితంగా పూల దిగుబడి కూడా పెరుగుతుంది. మొక్కల తలలను తుంచాక నిపుణుల సూచనలతో నత్రజని, పొటాష్ ఎరువులను తగిన మోతాదులో అందిస్తే నాణ్యమైన పువ్వులను పొందవచ్చు.


