News April 7, 2025

BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్

image

AP: భూకబ్జా కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి గన్నవరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన జైలులోనే ఉండాల్సి ఉంటుంది. మరోవైపు టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులోనూ వంశీ విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Similar News

News April 8, 2025

రూ. రెండున్నర లక్షలు కొట్టేసి సారీ లెటర్ పెట్టాడు!

image

ఓ దుకాణంలో రూ.2.45 లక్షలు దోచుకున్న దొంగ, తనను క్షమించమంటూ ఓ లేఖ అక్కడ వదిలి వెళ్లాడు. ‘అప్పుల్ని తీర్చుకునేందుకు ఈ చోరీ చేస్తున్నా. రామనవమి రోజు చేస్తున్న ఈ దొంగతనానికి నన్ను క్షమించండి. నాకు కావాల్సినంత మాత్రమే తీసుకున్నా. 6 నెలల్లో తిరిగిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేయించుకోండి’ అని అందులో రాశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

News April 8, 2025

‘ఆక్వా’కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు: ఆనం

image

AP: CM చంద్రబాబు ఆక్వా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని TDP సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ‘త్వరలోనే బాబు ఢిల్లీకి వెళ్లి వాణిజ్యమంత్రిని కలుస్తారు. US సుంకాల కారణంగా ఆక్వా సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చైనా, థాయ్‌లాండ్‌కు ఎగుమతి చేసే మార్గాన్ని పరిశీలించాలని సూచించారు’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. అత్యవసర ల్యాండింగ్

image

రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ముంబైకు వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. అప్పటికే ముంబై సమీపించిన విమానాన్ని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించారు. రాత్రి 8.50కి ల్యాండ్ అయిన విమానాన్ని వెంటనే దూరంగా తరలించి తనిఖీలు నిర్వహించామని అధికారులు తెలిపారు. విమానంలోని 225మందిని సురక్షితంగా కిందికి దించామని, ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని స్పష్టం చేశారు.

error: Content is protected !!