News April 12, 2025

వనజీవి రామయ్య కన్నుమూత

image

TG: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటుతో మరణించారు. కోటి మొక్కలు నాటి ప్రకృతి ప్రేమికుడిగా పేరు గాంచిన ఆయనను 2017లో కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి.

Similar News

News December 1, 2025

దండేపల్లి: ఎన్నికలను బహిష్కరించిన మూడు గ్రామాలు

image

దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్, వంజరిగూడ, గూడెం గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించారు. ఈ మూడు గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని మండల అధికారులు తెలిపారు. నెల్కి వెంకటాపూర్‌ను జనరల్‌గా మార్చాలని, వంజరిగూడను వెంకటాపూర్‌లో కలపాలని, గూడెంలో ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

News December 1, 2025

అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.

News December 1, 2025

భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

image

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.