News August 7, 2024
BREAKING: ఆస్పత్రిలో చేరిన వినేశ్ ఫొగట్

పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ అస్వస్థతకు గురయ్యారు. బరువు తగ్గడానికి రాత్రంతా కఠోర సాధన చేసిన ఆమె, డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఓవర్ వెయిట్ కారణంగా ఫైనల్కు ముందు ఆమెపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.
Similar News
News October 20, 2025
వీరికి వారం ముందు నుంచే ‘దీపావళి’

మనం దీపావళి ఏ రోజైతే ఆరోజే వేడుకలు చేసుకుంటాం. కానీ ఛత్తీస్గఢ్లోని సెమ్రా గ్రామంలో దీపావళి వేడుకలు వారం ముందు నుంచే మొదలవుతాయి. ఈ ఆచారం వెనుక ఓ కారణం ఉంది. పూర్వం సింహం దాడిలో మరణించిన సర్దార్ దేవ్, గ్రామ పూజారి కలలోకి వచ్చి దీపావళి పండుగను ముందే జరపాలని చెప్పాడట. అలా చేయకపోతే దురదృష్టం కలుగుతుందని హెచ్చరించాడట. అప్పటి నుంచి అక్కడ ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఊర్లో OCT 20నే దీపావళి మొదలైంది.
News October 20, 2025
APPLY NOW: SECIలో 32 పోస్టులు

సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI) 32 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 24, సీనియర్ కన్సల్టెంట్(10) పోస్టులకు ఈనెల 29 ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్, డిప్లొమా, ITI, CA, MBA(Fin) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.seci.co.in/
News October 20, 2025
జుట్టు వాసన వస్తోందా? ‘కలబంద’ ట్రై చేయండి

కొందరు మహిళలకు తల స్నానం చేసిన కొన్ని గంటల్లోనే వెంట్రుకలు వాసన వస్తుంటాయి. జుట్టు కూడా ఎక్కువగా ఊడిపోతుంటుంది. అలాంటి వారు కలబంద జెల్ లేదా నూనెను వారానికి ఓసారి తలకు పట్టించి కడిగితే వెంట్రుకల నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. అలోవెరాలోని విటమిన్ A, C, E, B12 జుట్టు ఊడిపోకుండా కాపాడుతాయి. వెంట్రుకలు మృదువుగా మారతాయి. తలకు తగినంత తేమను అందిస్తూ ఇదొక కండిషనర్లా పనిచేస్తుంది.
#ShareIt