News July 15, 2024
BREAKING: WGL: ‘వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణం బలి’

WGL జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం.. నెక్కొండ మండలం ముదిగొండ వాసి మణిదీప్(10)ను కుక్క కరిసింది. దీంతో MGMలో 3 ఏఆర్వీ ఇంజెక్షన్లను కుటుంబీకులు వేయించి, అనంతరం స్థానిక RMP దగ్గరకి తీసుకెళ్లగా 4వ ఇంజెక్షన్ వేశారు. వేసిన 5నిమిషాలకే బాలుడు కుప్పకూలడంతో 108లో మళ్లీ MGMకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వైద్యులు, RMPనిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News July 6, 2025
వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలలకు కొత్త భవనాలు

వరంగల్ జిల్లాలో ఐదు పాఠశాలల్లో అదనంగా నూతన భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. గీసుగొండ మండలం నందనాయక్ తండా, నర్సంపేట మండల బోజ్యానాయక్ తండా, చిన్న గురజాల, పార్శ్య నాయక్ తండా, స్వామి నాయక్ తండాల్లో ఏర్పాటు చేయనున్న నూతన భవన నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సమావేశంలో డీఈవోను ఆదేశించారు.
News July 6, 2025
వరంగల్: ఇక్కడి రోటి యమ ఫేమస్..!

ఉత్తరాది రుచులు ఇక్కడి యువతను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది వలసదారులు వర్ధన్నపేటతో పాటు రాయపర్తి, వరంగల్- ఖమ్మం జాతీయ రహదారి వెంట డాబాలను ఏర్పాటు చేసి అక్కడి రోటితో పాటు పలు కర్రీలు చేస్తూ రుచులు చూపిస్తున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగించే వంటకాలు కావడంతో ప్రతి ఒక్కరూ వీటిపై మక్కువ చూపుతున్నారు.
News July 5, 2025
నర్సంపేట: ఇళ్లలో చోరీ.. ఏడుగురు అరెస్ట్

నర్సంపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ అంకిత్ వివరాలు.. ఖానాపురం మండలానికి చెందిన రాజేశ్, నర్సంపేటకు అక్షయ్ కుమార్, అక్షయ్, సాయిరాం, ఉదయ్, విపిన్, సుబానిలు గ్రూప్‌గా ఏర్పడి డబ్బుల కోసం ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.