News September 24, 2024

BREAKING.. WGL: గోల్కొండ ఎక్స్ ప్రెస్ రద్దు

image

గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నెక్కొండ, వరంగల్, కాజీపేట, మీదుగా సికింద్రాబాద్ వెళ్లనున్న ఈ రైలును పలు కారణాలతో నేడు రద్దు చేశామని, ప్రయాణికులు ప్రయాణానికి వేరే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నెక్కొండ, వరంగల్ రైల్వే స్టేషన్ల వద్దకు ఇప్పటికే చేరుకున్న ప్రయాణికులు అక్కడి నుంచి వెనుతిరిగి వెళుతున్నారు.

Similar News

News February 9, 2026

పీఎంశ్రీ పాఠశాలలపై వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

పీఎంశ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన విద్యాలయాల పనితీరుపై వరంగల్ కలెక్టర్ సత్య శారద సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఈ పథకం కింద కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో అమలవుతున్న కార్యక్రమాలు, నిర్వహణ తీరుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు, యోగా శిక్షణ తరగతులు, సైన్స్ ఫెయిర్‌లు తదితర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.

News February 9, 2026

వరంగల్: ‘ఈనెల 11న వేతనంతో కూడిన సెలవు’

image

ఈనెల 11న పోలింగ్ నేపథ్యంలో వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో వేతనంతో కూడిన సెలవు కల్పిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాల విద్యా సంస్థలకు ఈనెల 10, 11వ తేదీల్లో, 13వ తేదీ ఓట్ల లెక్కింపు రోజు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

News February 9, 2026

పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో మద్యం దుకాణాల మూసివేత: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు సహకరించాలని కోరారు.