News January 30, 2025

BREAKING: ‘వాట్సాప్ గవర్నెన్స్’ ప్రారంభం

image

AP: దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దేవదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, CMRF, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఈ సేవలకు గాను గత అక్టోబర్‌లో ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది.

Similar News

News January 8, 2026

HT పత్తి విత్తనాలు కొనొద్దు: మంత్రి తుమ్మల

image

TG: HT పత్తి విత్తనాల అమ్మకాలను రాష్ట్రంలో అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. ఫీల్డ్ ట్రయల్స్‌లో ఫెయిలైనందున కేంద్రం ఆ కంపెనీ విత్తనాల అమ్మకాలకు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. అధిక దిగుబడి వస్తుందనే ఆశతో రైతులు HT పత్తి విత్తనాలను కొని మోసపోవద్దని కోరారు. పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కో-మార్కెటింగ్‌కు విధివిధానాలు రూపొందించాలన్నారు.

News January 8, 2026

వాహనదారులకు అలర్ట్.. ఈ విషయం తెలుసా?

image

హెల్మెట్, లైసెన్స్ ఉంటే సరిపోదు మీ వాహనం అన్-సేఫ్ కండిషన్‌లో ఉన్నా భారీ ఫైన్ తప్పదనే విషయం మీకు తెలుసా? MV యాక్ట్-2019 ప్రకారం మీ బైక్/కారులో లోపాలున్నా భారీ ఫైన్ విధిస్తారు. మీ వాహన లోపాల వల్ల ఇతరులకు ప్రమాదం జరగొచ్చని చర్యలు తీసుకోవచ్చు. ఇండికేటర్ పని చేయకపోయినా రూ.5వేలు ఫైన్/ 3 నెలలు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. అందుకే మీ వాహనాన్ని ఓసారి చెక్ చేసుకోండి. SHARE IT

News January 8, 2026

బెండలో నీటి యాజమాన్యం, కలుపు నివారణ

image

బెండ విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉంటే బిందుసేద్యం విధానం అనుసరించడం మంచిది. పంటకాలంలో 3 నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన 2 వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి.